లైగర్ ఫ్లాప్ తర్వాత తాను చేయబోయే ప్రాజెక్టులపై మరింత దృష్టి సారించారు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన లైగర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో విజయ్ కెరీర్ ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలోనే సినిమా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగువేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ తన తర్వాతి ప్రాజెక్టు తమిళ దర్శకుడు శంకర్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ నన్నూరితో చేయాల్సి ఉండగా అది క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు అదే కథను విజయ్ దేవరకొండకు వినిపించగా ఓకే చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ కథను సిద్దం చేసిన గౌతమ్ దీనిని విజయ్‌కి చెప్పగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన కెరీర్‌కు ప్లస్ పాయింట్‌గా నిలిచిని పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి లవ్ స్టోరీతోనే మళ్లీ హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లైగర్ తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం ఖుషీ కూడా ప్రేమకథా చిత్రమే కావడం విశేషం.