తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఇవాళ జరగనుంది. 503 పోస్టుల భర్తీకి పరీక్ష జరగనుండగా 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్షకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఒక్కరోజే 20వేల మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1019 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 349 కేంద్రాల్లో దాదాపు 1.55లక్షల మంది పరీక్ష రాయనున్నారు.
ఈ సూచనలు తప్పక పాటించాలి..
()పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.30 గంటల నుంచి 10.15 గంటల వరకు అనుమతిస్తారు. ఆ తరువాత అనుమతి ఉండదు.
()ప్రశ్నపత్రం తెరవగానే అందులో 150 ప్రశ్నలూ ముద్రించారో లేదో చూసుకోవాలి.
()ప్రశ్నపత్రంపై జవాబులను మార్కు చేయవద్దు.
()ఓఎంఆర్ షీట్‌లో సూచించిన చోట కాకుండా ఎక్కడైనా హాల్ టికెట్ నంబరు రాసినా, ఇతర గుర్తులు వేసినా ఆ పత్రాన్ని చెల్లనిదిగా పరిగణిస్తారు.
()వృత్తాల్ని సరిగా నింపి బుక్‌లెట్ సిరీస్ నెంబరు రాయకున్నా, ఒక్క అంకెను తప్పించినా ఆ ఓఎంఆర్‌ను మూల్యాంకనానికి పరిగణలోకి తీసుకోరు.
()అభ్యర్థి పేరు ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి. డబుల్ బబ్లింగ్, చాక్ పౌడర్, రబ్బరు వాడి జవాబును చెరిపిన, తప్పుగా వివరాలు పేర్కొన్న జవాబు పత్రాలను పరిశీలనలోకి తీసుకోరు.
()పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు హాల్ టికెట్‌తో పాటు పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటరు, ఆధార్ కార్డు తదితర ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.
() అభ్యర్థి ఫొటో, సిగ్నేచర్ ఫ్రింట్ కాకుంటే మూడు పాస్ పోర్టు ఫొటోలపై గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తీసుకొని పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్ కు హామీ పత్రం ఇవ్వాలి.ఓఎంఆర్ పై అభ్యర్థి, ఇన్విజిలేటర్ ఇద్దరూ సంతకాలు చేయాలి. ఏ ఒక్కరి సంతకం లేకున్నా మూల్యాంకనానికి జబాబు పత్రాల్ని పరిశీలించరు.