తక్కువ ఖర్చుతో నగర అందాల వీక్షణ :ఆర్టీసీ

104
- Advertisement -

తెలంగాణ అలనాటి అందమైన ప్రదేశాలకు పెట్టింది పేరు. హైదరాబాద్‌ రాజ్యంను పాలించిన కుతుబ్‌షాహీలు, అస్‌ఫ్‌జాహీల కంటే ముందు నుంచి తెలంగాణ రాజ్యం పరిఢవిల్లింది.  క్రీస్తు పూర్వం నుంచి భారతదేశంలో తెలంగాణ చరితకు అనవాళ్లు కనిపిస్తుంటాయి. కాకతీయుల కాలం నుంచి తెలంగాణ చరిత్ర ప్రపంచఖ్యాతీని గడిచింది.  కాకతీయుల కాలంలో నిర్మించిన ప్రఖ్యాత రామప్ప ఆలయంకు యునెస్కో గుర్తింపు లభించినప్పటి నుంచి తెలంగాణ టూరిజం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.

తాజాగా తెలంగాణ ఆర్టీసీ నగరంలోని చారిత్రక ప్రదేశాలను చూసేందుకు ప్రత్యేక బస్సు సర్వీస్‌లను ఏర్పాటు చేసింది. ఈ సర్వీసులను హైదరాబాద్‌ దర్శినిగా నామకరణం చేశారు. ప్రతి శని, ఆదివారాల్లో రెండు సర్వీసులు నడవనున్నాయని తెలిపారు. ఉదయం 8.30నుంచి బయలుదేరి రాత్రి 8గంటలకి టూర్‌ ముగుస్తుందని తెలిపారు. సిక్రిందాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌ నుంచి బయలుదేరి నగరంలో ఉన్న పలు చారిత్రక ప్రదేశాలను తింపుతూ మళ్లీ ఆదే స్పాట్‌ కు చేరుకుంటుదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 అని; మెట్రో లగ్జరీ ఏసీ బస్సులో పెద్దలకు రూ.450 పిల్లలకు రూ.340 ఛార్జీగా నిర్ణయించారు. ఆ రూట్‌ ఏంటో మరి చూద్దాం రండి…

రూట్ మ్యాప్..
ఉదయం 8:30కు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి బస్సు సర్వీసు ప్రారంభమై బిర్లా మందిరం దర్శనంతో ప్రారంభమవుతుంది. ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం 12.30వరకు చౌమొహల్లా ప్యాలెస్ సందర్శనకు ఏర్పాటు. మధ్యాహ్నం 1.00 నుంచి 1.45వరకు తారామతి బారాదరి రిసార్ట్స్‌లో లంచ్‌ ( భోజన ఖర్చు ప్రయాణికులదే కానీ ఆర్టీసీ తరపున 10శాతం రాయితీ కల్పించారు) మధ్యాహ్నం 2గంటల నుంచి 3.30వరకు గోల్కొండ కోట సందర్శించనున్నారు. ఆ తదుపరి సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు దుర్గం చెరువు, 5.30నుంచి 6గంటల వరకు కేబుల్‌ బ్రిడ్జ్‌ను సందర్శన. సాయంత్రం 6.30నుంచి 7.30వరకు హుస్సేన్‌ సాగర్‌, ఎన్టీఆర్‌ పార్క్‌ చూపిస్తారు. రాత్రి 8గంటలకు బస్సులు సిక్రింద్రాబాద్‌ ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకోనున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

- Advertisement -