ఒక వ్యక్తి స్వార్ధం కోసం మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రధానిని ప్రశ్నించిన కేటీఆర్….తమకు నల్లగొండ ప్రయోజనాలు ముఖ్యమని తేల్చిచెప్పారు.
ఒక వేళ నల్గొండకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీ నుండి తప్పుకుంటామని పేర్కొన్నారు. వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. గుజరాత్‌కు గత ఐదు నెలల్లో రూ.80 వేల కోట్ల ప్యాకేజీలు. తెలంగాణకు కనీసం రూ.18వేల కోట్లు ఇవ్వలేరా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరగదు, మరొక వ్యక్తికీ కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు
రాజకీయ ప్రయోజనం కాదు, నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోడీ గారు
గుజరాత్ కు గత ఐదు నెలల్లో ₹80,000 కోట్ల ప్యాకేజీలు. మా తెలంగాణకు కనీసం ₹18,000 కోట్లు ఇవ్వలేరా?
— KTR (@KTRTRS) October 12, 2022