గ్రీన్‌ ఛాలెంజ్‌లో బిగ్ బాస్ ఆరోహి రావ్..

114
GIC
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రశషన్ నగర్ లో మొక్కలు నాటారు బిగ్ బాస్ 6 కాంటెస్టెంట్ ఆరోహి రావ్ …ఈ సందర్భంగా ఆరోహి రావ్ మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.

చెట్లను నరికి ఇళ్ళు కట్టుకుంటున్నారు కానీ ఆ ఇంట్లో ఉండే వాళ్ళు బ్రతకాలంటే ఆక్సీజన్ ఎంతో అవసరం అన్నారు.మనం మొక్కలు నాటుతే మనల్ని చూసి మరి కొంత మంది మొక్కలు నాటి రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని ఇచ్చినవాళ్ళము అవుతాము. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొనే అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా నటుడు శాని, Tv9 సంధ్య, మై విలేజ్ షో అనిల్ వీరి ముగ్గురు మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -