దేశంలోని బీజేపీ చిల్లర నాయకులకు భయపడమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటైన టీఆర్‌ఎస్‌వీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మోదీకి, బోడికి బెదిరము…వాళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ ఈడీ ఐటీ దాడులు చేయిస్తామని బెదిరించడం సిగ్గుచేటు అన్నారు.
శ్రీలంక దేశంలో అక్కడి ప్రభుత్వ పెద్దలు, విద్యుత్ రంగ సంస్థ అధిపతి అనేక ఆరోపణలు చేశారన్నారు. రూ.6వేల కోట్ల కాంట్రాక్ట్ గౌతం అదానీకి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లుగా రుజువైందని మండిపడ్డారు. నీకు నీతి సిగ్గు మానం ఉంటే దాని మీద వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
8 ఏండ్లలో మోదీ చేసిందేమీ లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. పేదలున్న దేశంగా భారత్ మారిందన్నాయన…. ధనవంతులే మరింత ధనవంతులుగా మారిపోయారని అన్నారు. ఒక అదానీ, రాజగోపాల్ రెడ్డి ధనవంతులైతే ఈ దేశ ప్రజల భాగ్య రేఖలు మారిపోతాయా? అని ప్రశ్నించారు. దేశం ఒక వైపు పేదరికంలోకి పోతోంది. నిరుద్యోగం పతాక స్థాయికి చేరింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకయన్నారు.
తెలంగాణ మోడల్‌ను దేశానికి చూపేందుకే భారత్ రాష్ట్రసమితి పెడుతున్నామన్నారు. గుజరాత్ మోడల్‌తో దేశాన్ని గోల్‌మాల్ చేసి అధికారంలోకి వచ్చి కేవలం కొంతమందిని మాత్రమే ధనవంతులను చేస్తున్నావని అని మండిపడ్డారు. పేదవారికి అండగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, భారత్ రాష్ట్ర సమితి ఎందుకు కావొద్దు. ఇక్కడ ఎవరెవరో రాజకీయం చేయొచ్చు. కానీ తెలంగాణ వారు బయటకు వెళ్లి రాజకీయం చేయొద్దా? తెలంగాణకు చేసినట్లే.. దేశంలోని ఇతర ప్రాంతాలకు మన అభివృద్ధిని విస్తరిద్దాం. బలంగా గులాబీ జెండాను ఇతర ప్రాంతాల్లో నాటుదామని కేటీఆర్ పిలుపునిచ్చారు.