బీసీసీఐ చీఫ్ రేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న అమిత్ షా కొడుకు జై షా తర్వాత బీసీసీఐ పగ్గాలు చేపట్టడం ఖాయమని అంతా భావించగా తాజాగా మరోపేరు తెరపైకి వచ్చింది. గంగూలీ స్థానంలో కర్ణాటకకు చెందిన రోజర్ బిన్నీ బీసీసీఐకి బాస్‌గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన బిన్నీ.. ఇంతకు ముందు బీసీసీఐలో సెలక్షన్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. బీసీసీఐ కార్యదర్శిగా జై షా కొనసాగే అవకాశం కనిపిస్తుండగా.. గంగూలీ ఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడతాడని సమాచారం.
బీసీసీఐ అధ్యక్ష పదవితోపాటు ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు అక్టోబర్ 18న ఎన్నికలు జరగనుండగా.. 11, 12 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేసే వెసులుబాటు కల్పించారు. అక్టోబర్ 13న నామినేషన్లను పరిశీలిస్తారు. 14 వ తేదీ వరకు నామినేషన్లను వెనక్కి తీసుకునే అవకాశం కల్పించారు.