మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ హంగామా వరల్డ్ వైడ్ గా మొదలైంది. విజయదశమి కానుకగా సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకురాగా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. పొలిటికల్ మాస్ థ్రిల్లర్ గా ఈ చిత్రం మలయాళీ సూపర్ హిట్ లూసిఫెర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కగా మోహన్ రాజా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, నయన తార కీలక పాత్రలు పోషించగా ఈ సినిమాతో మెగాస్టార్ హిట్ కొట్టాడా లేదా తెలుసుకుందాం..
కథ:
సినిమా కథ పొలిటికల్ డ్రామా..ముఖ్యమంత్రి పదవి చుట్టూ కథ తిరుగుతుంది. జన జాగృతి పార్టీకి చెందిన ప్రస్తుత సిఎం పికెఆర్ మరణించగా తర్వాత సీఎం సీటు కోసం రచ్చ జరుగుతున్నప్పుడు బ్రహ్మ (చిరంజీవి) పరిస్థితిలోకి ప్రవేశించి పరిస్థితిని ఎలా చక్కదిద్దాడు అనేదే కథ. సత్య ప్రియ (నయనతార), జయ దేవ్ (సత్యదేవ్) మరియు వర్మ (మురళీ శర్మ)ల మధ్య చిరు కింగ్ మేకర్‌గా మారి పీకేఆర్ కుటుంబానికి చేసిన మంచి ఏంటనేదే గాడ్ ఫాదర్ కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ చిరంజీవి నటన, క్యాస్టింగ్, ఫస్ట్ హాఫ్. మెగాస్టార్ చిరంజీవి తన నటనతో ఇరగదీశాడు. స్టైలీష్ లుక్, ఆసక్తికర పాత్రలో ఒదిగిపోయారు. ఇక సినిమాకు మరో హైలైట్ నయనత తార. సీఎం కుమార్తెగా తన పాత్రలో ఒదిగిపోయింది. సత్య దేవ్ విలన్‌గా అద్భుతంగా నటించగా సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగితా నటీనటుల్లో సునీల్, బ్రహ్మాజీ, సముద్రఖని, అనసూయ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ సల్మాన్ ఖాన్ ట్రాక్ వీక్ , చివరి అర్ధగంట. సెకండాఫ్‌పై దర్శకుడు మరింత దృష్టిసారిస్తే బాగుండేది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. తొలిసారి చిరంజీవి చిత్రానికి సంగీతం అందించిన తమన్ పర్వాలేదనిపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోరుపై మరింత దృష్టి సారిస్తే బాగుండేది. నీరవ్ షా కెమెరా క్రాంక్ చేయడం మాస్ చెక్కుచెదరకుండా క్లాసీ విజువల్స్ ఇస్తుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలకు వంక పెట్టలేం..
తీర్పు:
లూసిఫెర్ మలయాళీ చిత్రం.. ఆ కథని చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్లుగా.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా, ఇక్కడ పొలిటికల్ పరిస్థితులని అర్థం చేసుకుని మోహన్ రాజా స్క్రిప్ట్ తయారు చేసిన విధానం మెచ్చుకోవాల్సిందే. సెకండ్ హాఫ్ ని ఎమోషన్స్, ఎలివేషన్స్ తో చక్కగా మిక్స్ చేశారు. సల్మాన్ ఖాన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ మోహన్ రాజా తెలివిగా ఉపయోగించుకున్నారు. ఓవరాల్‌గా ఆచార్య ఫ్లాప్‌ను గాడ్ ఫాదర్‌తో చెరిపేశారు మెగాస్టార్.
విడుదల తేదీ:05/10/2022
రేటింగ్: 2.75/5
నటీనటులు: చిరంజీవి, నయనతార
సంగీతం: తమన్
నిర్మాణం: కొణిదెల ప్రొడక్షన్స్,ఎన్వీ ప్రసాద్,ఆర్బీ చౌదరి
దర్శకత్వం: మోహన్ రాజా