అక్టోబర్‌ 5న పార్టీ జనరల్ బాడీ మీటింగ్‌ :సీఎం కేసీఆర్‌

123
- Advertisement -

తెలంగాణ భవన్ లో దసరా నాడు (అక్టోబర్ 05) ఉదయం 11 గంటలకు తలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా జరగుతుందని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రభావం సర్వసభ్య సమావేశంపై ఉండదని స్పష్టం చేశారు. సభ్యులెవరూ గందగోళానికి గురికావద్దని అన్నారు. ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్ 05 వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. దసరా పండుగ రోజు పార్టీ పేరు ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈ నెల 5న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో పాటు జిల్లాల నేతలు రానున్నారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో టీఆర్ఎస్ మీటింగ్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వాహణపై స్పష్టతనిచ్చారు.

- Advertisement -