బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకుంది. నాలుగోవారంలో భాగంగా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు ఆరోహి. సండే ఫన్డేలో భాగంగా ఇంటి సభ్యులతో కలిసి ఫన్నీ గేమ్స్ ఆడించారు నాగార్జున. ఘోస్ట్ మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ ప్రవీన్ సత్తారు, సోనాల్ చౌహాన్ స్టేజ్‌పై సందడి చేశారు. హౌస్‌మెట్స్‌తో ఓ గేమ్ ఆడించి అలరించారు.
తొలుత దసరా స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. ఈ దసరా ఫెస్టివల్ షోను ఒకరిని సేవ్ చేసి ప్రారంభిద్దామని నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ చేత టెంకాయిలు కొట్టించారు. వాటిలో ఒక చీటి ఉంచి.. సేఫ్, అన్ సేఫ్ అని రాశారు. ఇందులో శ్రీహాన్‌కు సేఫ్ చీటి రావడంతో సేవ్ అయినట్లు ప్రకటించారు. ఇక చంటికి సంబంధించి ఇష్యూపై వీడియో చూపించి క్లారిటీ ఇవ్వడంతో చంటికి కీర్తి క్షమాపణలు చెప్పింది.
బతుకమ్మ పాటలకు హౌస్‌లోని కంటెస్టెంట్స్ డ్యాన్స్ వేశారు. నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరికి ఒక గంట చేతికి.. గంట మోగించిన గలాట గీతూ సేవ్ అయినట్లు నాగార్జున తెలిపారు. చివరికి సుదీప, ఆరోహి మిగిలారు. స్టేజ్‌పై రెండు కుండలు ఉంచి.. వాటిలో నీళ్లు పోశారు నాగార్జున. వాటిలో నుంచి రెడ్ కలర్ వచ్చిన ఆరోహి ఎలిమినేట్ అయినట్లు చెప్పారు.