ముకేశ్‌ అంబానీకి జడ్‌ నుంచి జడ్‌ప్లస్‌ భద్రత పెంపు

305
- Advertisement -

భారత ఇంటిలిజెన్స్‌ చేసిన హెచ్చరికలతో పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీకి భద్రతను పెంచారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జడ్‌ కేటగిరీ నుంచి జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతను    పెంచుతున్నట్టు ప్రకటించారు.  గతేడాది ఆయన నివాసం యాంటిలియ వద్ద బాంబు కలకలం నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచాలని హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో ఇకపై ముఖేష్‌కు 55 మంది సిబ్బందితో కూడిన భద్రత కల్పించననున్నారు. ఇందులో 10మందికి పైగా ఎన్‌ఎస్‌జీ కమాండోలు, ఇతర పోలీసు అధికారులు ఉంటారు.

- Advertisement -