నాకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్స్ ఎవరూ లేరు…. నా అభిమానులే గాడ్ ఫాదర్స్ అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై చిరంజీవి, నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అనంతపురంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చిరు.. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. తాను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఈ నేల తడుస్తుంది. గతంలో రాజకీయ ప్రచారానికి, ఇంద్ర సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందన్నారు. గాడ్‌ఫాదర్ సినిమా మలయాళ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం రామ్ చరణ్ అన్నారు.
ఇక నాపై ఉన్న నమ్మకం, ప్రేమ, గౌరవంతో ‘గాడ్‌ఫాదర్’ కథ వినకుండానే సల్మాన్ ఖాన్ ఇందులో నటించడానికి ఒప్పుకున్నారని తెలిపారు. అక్టోబర్ 5న తన సినిమాతో పాటు విడుదలవుతున్న నాగార్జున ‘ది ఘోస్ట్’, యువ హీరో గణేష్ ‘స్వాతిముత్యం’ సినిమాలు కూడా మంచి విజయం సాధించాలన్నారు చిరు.