- Advertisement -
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో విజయం సాధించింది భారత్. సఫారీలు విధించిన 107 పరుగుల స్వల్ప టార్గెట్ను భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కొల్పోయి చేధించింది. సూర్యకుమార్ యాదవ్ 33 బంతుల్లో 50 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేశవ్ మహరాజ్ (41 పరుగులు) టాప్ స్కోరర్ కావడం విశేషం. మార్క్రమ్ (25), పార్నెల్ (24) ఫర్వాలేదనిపించారు. రత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్, హర్షల్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది భారత్.
- Advertisement -