- Advertisement -
వశిష్ట దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం బింబిసార. ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాదు కళ్యాణ్ రామ్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే వారికి ఇది గుడ్‌న్యూస్. జీ5లో అక్టోబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది బింబిసార. విడుదలైన 50 రోజుల తరువాతే ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని తెలిపిన చిత్రయూనిట్ ఆ విధంగానే డేట్‌ని ప్రకటించింది.
దసరా సెలవుల సమయంలో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తుండటంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
- Advertisement -