వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో… అంతకుముందు ప్రాక్టీస్ కోసం వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని భారత్ భావిస్తున్నది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. భారత్-దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌దే పైచేయి సాధించింది. ఈ రెండు జట్లు మొత్తంగా 20 సార్లు పోటీ పడగా టీమ్‌ఇండియా 11సార్లు గెలుపొందింది. సఫారీ జట్టు 8సార్లు విజయం సాధించగా…ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
బుధవారం తిరువనంతపురం వేదికగా జరుగనున్న తొలి టీ20 కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇక్కడికి చేరుకున్నాయి. సోమవారం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన భారత ఆటగాళ్లకు కేరళ క్రికెట్ సంఘం ఘనంగా స్వాగతం పలికింది. ఆదివారమే ఇక్కడికి వచ్చిన సఫారీ జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (కీపర్), దినేశ్ కార్తీక్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, యుజ్‌వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమేశ్ యాదవ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా.
సఫారీ జట్టు : తెంబా బవుమా (కెప్టెన్), క్వింటాన్ డికాక్ (కీపర్), రీజా హెండ్రిక్స్, హెన్‌రిక్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎంగిడి, నోకియా, వేన్ పార్నెల్, ప్రిటోరియస్, కగిసో రబాడా, రిలీ రోసో, తబ్రిజ్ షంసి, ట్రిస్టన్ స్టబ్స్.