బీజేపీని ఓడించండి: సీతారాం ఏచూరి

104
- Advertisement -

భారతదేశాన్ని కాపాడాలంటే బీజేపీ ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి. విజయవాడలో దేశ రక్షణ భేరి బహిరంగ సభలో మాట్లాడిన ఏచూరి… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్న మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు.

దేశంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని…ప్రధాని మోదీ కార్పొరేట్లకి రూ. 13 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. ఏడేళ్లలో అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేర్చారని విమర్శించారు. మోదీ ప్రభుత్వాన్ని జగన్‌ ప్రభుత్వం నిలదీయాలని ….బీజేపీ పార్టీలోకి రాని వారిపై ఈడిచే దాడులు చేయిస్తుందని ఆరోపించారు. లౌకికవాదాన్ని కాపాడేందుకు ముందుకొచ్చే వారితో కలిసి పనిచేద్దామని తెలిపారు.

- Advertisement -