- Advertisement -
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బస్తీల్లో పర్యటించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కాలనీలు, బస్తీల్లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
బస్తీలు, కాలనీల్లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా బస్తీలు, కాలనీల్లో పర్యటనలు చేపట్టినట్టు తెలిపారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పార్కులు, చిల్డ్రన్స్ ప్లే గార్డెన్స్ ను పరిశీలించి అందులో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్తను వెంటనే క్లీన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
- Advertisement -