టీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతొంది. రోజురోజు ప్రముఖులు మొక్కలు నాటుతు పర్యావరణంపై అవగహనను కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి ఉమెన్స్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీత మొక్కలు నాటారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజుల విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సునీత గచ్చిబౌలి ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సీఐ సునీత మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ లో వాతావరణం చూస్తుంటే ఎంతో అందంగా గ్రీనరీతో నిండి ఉందన్నారు. భవితరాలకు మంచి వాతావరణం, ఆక్సీజన్ అందించడానికి కృషి చేస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌కు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తెలంగాణ పచ్చగా ఉండటానికి ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటి వాటి బాగోగులు చేపట్టి, వాటిని సంరక్షించే విధంగా కృషి చేస్తామన్నారు. ఇంత గొప్ప అవకాశంను కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాదాపూర్ సీఐ రవి, గచ్చిబౌలి సీఐ సురేష్, రాయదుర్గం సీఐ తిరుపతి, సీఐ ధనలక్ష్మి, సీఐ వెంకటేష్, సీఐ ఎస్బీ హేమ వీరిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు.