- Advertisement -
ఏపీ సీఎం వైఎస్ జగన్ తీరును తప్పుబట్టారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏపీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం అది మనకే గౌరవం…దాని పేరును మార్చడం సరికాదన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుకున్న పవిత్రత గంగలో కలిసిపోతుందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
పేరు మార్చడం కరెక్ట్ కాదన్నారు. దాని పవిత్రత దెబ్బతింటుందని.. ఇలా పేర్లు మార్చుకుంటూ పోతే చివరకు పేర్లు మిగలవన్నారు. జనాలకు కూడా కన్ఫ్యూజన్లోకి నెట్టివేసేలా తయారవుతుందని…ఎన్టీఆర్ పేరు పెట్టడం అదో గౌరవమని, ఇప్పుడు పేరు మార్చడం వల్ల ఆయనకు అగౌరవం ఆపాదించినట్లు అవుతుందని చెప్పారు.
అన్నివర్గాల నుండి ఎన్టీఆర్ పేరును మార్చడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
- Advertisement -