ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వెల్లడించారు. సిరిసిల్లలో గిఫ్ట్ ఏ స్మైల్ కింద విద్యార్థులకు మంత్రి కేటీఆర్ ట్యాబ్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..మన ఊరు-మన బడి కింద స్కూళ్లలో మరమ్మతులు చేశామని తెలిపారు. కొత్త ఆలోచనలతో పైకి ఎదగాలనే తపన ఉన్న విద్యార్థులకు కచ్చితంగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదని చెప్పారు. విదేశాల్లో విద్యనభ్యసించే వారికోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద రూ.20 లక్షలు ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ సర్కారేనని స్పష్టం చేశారు.
గిఫ్ట్ ఏ స్మైల్ కింద సిరిసిల్లకు ఆరు అంబులెన్సులు ఇచ్చామని, రాష్ట్ర వ్యాప్తంగా 120 అంబులెన్సులు సమకూరాయని చెప్పారు. దివ్యాంగుల కోసం 1200 ట్రై మోటార్ సైకిళ్లు అందించామని తెలిపారు.