25 నుంచి బతుకమ్మ సంబరాలు..

89
bathukamma
- Advertisement -

ఈ నెల 25 నుండి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరగనున్నాయి. తొమ్మిది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగే ఈ వేడుకలను ఈసారి కూడా ఉత్సాహవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు.

అమావాస్య రోజున మొదటి బతుకమ్మ అడతారు. ఈ సారి అమావాస్య సెప్టెంబర్ 25న వస్తుంది. దీన్ని పెత్తర అమావాస్య అని కూడా అంటారు. కేవలం తెలంగాణలోనే కాదు.. తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతి చోటా ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గల్ఫ్ దేశాలు, అమెరికా వంటి చోట్ల కూడా బతుకమ్మ ఆడుతారు.

బతుకమ్మ మధ్యలో గౌరమ్మను అలంకరించి, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి, తమ ముత్తయిదువ తనాన్ని నిలిపే గౌరమ్మను భక్తిగా పూజిస్తారు. మన సంప్రదాయంలో రకరకాల పూలతో దేవతల్ని పూజిస్తాం. కానీ, పూలనే దేవతా మూర్తిగా భావించి కొలిచే సంప్రదాయమే బతుకమ్మ.

- Advertisement -