- Advertisement -
దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తుందని తెలిపారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో భారత్ జోడో యాత్రను సమన్వయం చేసే బాధ్యత తనకు అప్పగించారని చెప్పారు.
ఇందుకోసమే తాను విజయవాడకు వచ్చానని… కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి బలంగా వెళుతుందన్నారు.చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్నా అందరూ సర్దుకుని పనిచేయండి. సమన్వయ లోపం ఉంటే వెంటనే నా దృష్టి కి తీసుకురండి అని చెప్పారు.
అభివృద్ధి ఫలాలు దేశంలో అందరికీ అందాలని రాహుల్ గాంధీ యాత్ర మొదలు పెట్టారని… ఏపీలో కూడా అందరూ కలిసి ఈ యాత్రను విజయవంతం చేసేందుకు ముందుకురావాలన్నారు.
- Advertisement -