అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంలో విచారణ..

51
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ దాఖలు చేశారు పర్యావరణ నిపుణుడు ప్రొ. కె పురుషోత్తం రెడ్డి.

విభజన చట్టం నిబంధనలు అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ, కేంద్రం, ఈసీని ప్రతివాదులుగా చేర్చగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -