దాయాదుల పోరు..నిమిషాల్లో టికెట్లు క్లోజ్

168
- Advertisement -

దాయాదుల పోరు అంటే ఉండే మజా అంతా ఇంత కాదు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇక తాజాగా త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్ – పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 23న మ్యాచ్ జరగనుంది.

మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్‌కు టికెట్లు, అడిషనల్ స్టాండింగ్ రూమ్ టికెట్లు మొత్తం నిమిషాల్లో అమ్ముడు పోయాయంట. ఈ టోర్నీకి ముందు అధికారికంగా టికెట్ల రీసేల్ విక్రయ వేదికను ప్రారంభిస్తామని, అక్కడ అభిమానులు అసలు ధరకు టికెట్లను మార్చుకోవచ్చని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇక టీ20 వరల్డ్ కప్‌ కోసం ఇప్పటికే ఐదు లక్షల మంది తమ సీట్లను రిజర్వు చేసుకున్నారు. మొత్తం 82 దేశాల నుంచి అభిమానులు ఈ టోర్నమెంట్ ను వీక్షించనున్నారు.

- Advertisement -