బిగ్ బాస్ 6..కెప్టెన్సీ రేసులో నలుగురు!

67
bb6
- Advertisement -

బిగ్ బాస్ 6 తెలుగు విజయవంతంగా సాగుతోంది. రెండోవారం కెప్టెన్సీ టాస్క్ ముగియగా రేసులో చంటి, ఇనయ, రాజ్, సూర్యలు గెలిచారు. ఆధ్యంతం ఆసక్తిగా సాగిన సిసింద్రీ టాస్క్‌ అందరిని మెప్పించగా గీతూకు మాత్రం చుక్కలు చూపించింది.

గీతూ ఎప్పుడూ కూడా పక్కన వాళ్లది లాక్కుందామా? వారిని గేమ్‌లోంచి తీసేద్దామా? అనే ఉద్దేశ్యంతోనే ఆడగా దాని వల్ల గీతూకు వచ్చిందేమీ లేకుండా పోయింది.
ఇక రేవంత్ బొమ్మను గీతూ లాస్ట్ అండ్ ఫౌండ్‌లో వేయడంతోనే అసలు కథ తిరిగింది.

అంతకు ముందు రేవంత్ టాస్క్ విషయంలో ఫైమా చేసిన తప్పు చివరకు ఆమెకు తగిలింది. రేవంత్ ఎంత బతిమిలాడినా కూడా ఫైమా తెచ్చివ్వలేదు. దీంతో రేవంత్ టాస్క్ ఓడిపోయాడు. అయితే అదే ఫైమా కోసం రేవంత్ మళ్లీ నిలబడ్డాడు. ఆమె కోసం టాస్క్ ఆడాడు. చివరకు రింగ్లో నిలబడ్డ వాడే కింగ్ అనే టాస్కులో ఫైమా ఘోరాతిఘోరంగా ఓడిపోయింది.

దీంతో ఫైమా కంటతడికి ఆపుకోలేకపోయింది. నన్ను పూర్తిగా ఆడనివ్వకుండా చేశారు.. నా బొమ్మను తీసి పారేశారు అంటూ తెగ బాధపడిపోయింది. తర్వాత ఐస్ క్రీం టైం అంటూ.. కోన్స్, స్కూప్స్ అరేంజ్ చేసే ఆటలో రాజ్ మొదటి బజర్‌లో గెలిచాడు. రెండో బజర్‌లో సూర్య గెలిచాడు.మొత్తంగా ఈ నలుగురిలో కెప్టెన్‌గా ఎవరు విన్ అవుతారో వేచిచూడాల్సిందే.

- Advertisement -