ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి స్వల్ప గాయాలు..

84
Ukraine president injured
- Advertisement -

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ కి పెను ప్రమాదం తప్పింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని చెప్పారు డాక్టర్లు.

ఈ ప్రమాదానికి సంబంధించి న్యాయాధికారులు విచారణ జరుపుతారన్నారు. హత్యాయత్నమా లేదా ప్రమాద వషాత్తు జరిగిందా అనే విషయం విచారణలో తేలుతుందని వెల్లడించారు.అయితే ఈ యాక్సిడెంట్‌ ఎప్పుడు జరిగిందనే విషయాన్ని తెలియజేయలేదు.

అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్యాసింజర్‌ కారు వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారుతోపాటు కాన్వాయ్‌లోని మరో వాహనాన్ని ఢీకొట్టింది.

- Advertisement -