సీఎం కేసీఆర్ను ఆపే శక్తి ఎవరికి లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మర్రిగూడెం, గట్టుప్పల్ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…తెలంగాణపై విషం చిమ్ముతూ బీజేపీ నాయకులు మిడతల్లాగా వచ్చి తెలంగాణాపై దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
దేశ ప్రజలు తెలంగాణా సాధించిన విజయాల గురించి మాట్లాడుతున్నరు. అందుకే బీజేపీ నాయకులు కేసీఆర్ పేరు వింటేనే బెంబేలెత్తిపోతున్నారు. కాంగ్రెస్ పాలనలో మునుగోడులో కరువు తాండవించింది…. ప్లోరైడ్ భూతం చుట్టుముట్టిందన్నారు.
గులాబీ జెండా నీడలోనే ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు. అందుకే కేంద్రం కేంద్రం సీఎం కేసీఆర్ను చూసి ఓర్వడం లేదన్నారు. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.