తెలంగాణలో ఏండ్లుగా అనిశ్చితి కొనసాగుతున్న పోడు భూముల పోరు త్వరలో ముగియనుంది. పోడు భూముల కోసం జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని ట్రైబల్ వెల్‌ఫేర్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ కమిటీలకు జిల్లా ఇంచార్జి మినిస్టర్ ఛైరపర్సన్‌గా వ్యవహరిస్తారు. పోలీసు కమిషనర్ లేదా ఎస్పీ , ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ డీఆర్డీవో, డీటీడీవో ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు ఇతరులను కూడా అవసరం మేరకు ఆహ్వానించే అధికారం ఈ కమిటీలకు ఉంటుంది. జిల్లా, మండలం, గ్రామపంచాయతీ స్థాయిలో అడవులను సంరక్షించేందుకు ఈ కమిటీ కృషి చేస్తుంది. పోడు భూముల కింద రిజిస్టర్ అయిన భుముల వివరాలను పరిశీలిస్తుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ కమిటీ నిర్ణయాలకు అనుగుణంగా చర్యలు చేపడతారు.