అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త పరిణమాలు సంతరించుకోంటున్నాయి. తాజాగా అమెరికా పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమాన పరికరాలను అమ్మేందుకు బైడెన్ సర్కార్ సిద్ధమైంది. సుమారు 450 మిలియన్ల డాలర్ల ఖరీదైన ఎఫ్-16 విమాన పరికరాలను అమ్మేందుకు అమెరికా సిద్ధమైంది. భవిష్యత్తులో పాక్‌ను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది. అయితే ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు యూఎస్ కాంగ్రెస్ ప్రకటించింది. బుధవారం రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌లో అమెరికా కాంగ్రెస్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఎఫ్-16లతో పాటు సంబంధిత ఎక్విప్‌మెంట్‌ను సుమారు 450 మిలియన్ల డాలర్లకు అమ్మేందుకు ఆమోదం తెలిపినట్లు యూఎస్ కాంగ్రెస్ పేర్కొన్నది. ఈ అమ్మకానికి సంబంధించి డిఫెన్స్ సెక్యూరిటీ కొఆపరేషన్ ఏజెన్సీ ద్రువీకరణ ప్రకటన విడుదల చేసింది.
2018లో ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడూ పాక్‌కు 200 మిలియన్ల డాలర్ల సహాయాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో విఫలమైనందున్న ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. అఫ్గాన్ తాలిబన్లు, హక్కాన్నీ నెట్‌వర్క్ వంటి ఉగ్రవాద సంస్థలను నిలువరించడంలో విఫలమవుతుందంటూ ఆ సహకారాన్ని ఆపేశారు. అలాగే ఉగ్రవాదం పోరాటంలో పాక్ తమ భాగస్వామి కాదని ఆ సందర్భంగా పేర్కొన్నారు.