- Advertisement -
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోళ్తాపడింది.ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనతో మేకర్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 30 నుండి స్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
విజయ్ సరసన అనన్యపాండే హీరోయిన్‌గా నటించగా ఈ చిత్రాన్ని కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు.
- Advertisement -