మూడో రౌండ్‌లో ఓడిన సెరీనా..

141
serina
- Advertisement -

యూఎస్ ఓపెన్‌లో సెరీనా విలియమ్స్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.మూడో రౌండ్‌లో సెరీనా 7-5, 6-7, 6-1 స్కోర్ తేడాతో అజ్లా టామ్‌జానోవిక్ చేతిలో ఓట‌మి పాలైంది. 29 ఏళ్ల ఆస్ట్రేలియా క్రీడాకారిణి టామ్‌జానోవిక్ తొలి సెట్‌లో దూకుడు ఆట‌ను ప్ర‌ద‌ర్శించింది. రెండ‌వ సెట్‌ను అతి క‌ష్టంగా నెగ్గిన సెరీనా.. ఇక మూడ‌వ సెట్లో మాత్రం చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ దాదాపు 83 నిమిషాల పాటు సాగింది. దీంతో సెరీనా సుదీర్ఘ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది.

కెరీర్‌లో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన సెరీనా .. గ్రేటెస్ట్ చాంపియ‌న్‌గా టెన్నిస్ క్రీడ నుంచి నిష్క్ర‌మించింది. ఇదే త‌న చివ‌రి టోర్నీ అని గ‌తంలో సెరీనా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -