కార్తీకేయ 2..బాలీవుడ్‌కి నిఖిల్?

83
nikhil
- Advertisement -

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ సత్తాచాటాంది. భారీ వసూళ్లను రాబట్టి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టేలా చేసింది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా ఒక్క బాలీవుడ్ నుంచే 25 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

దీంతో సినిమా సక్సెస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు నిఖిల్. ఈ సినిమా వల్ల తనకు బాలీవుడ్ లో మంచి పేరు వచ్చిందని… ప్రేక్షకులు నన్ను గుర్తుపడుతున్నారు. ఒక రెండు బాలీవుడ్ సంస్థల నుంచి నాకు ఆఫర్స్ కూడా వచ్చాయి. ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను. మరిన్ని ఆఫర్స్ కూడా వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఏ ప్రాజెక్టు ఓకే చెయ్యట్లేదన్నారు.

ఇప్పుడు ఆల్రెడీ ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఏ బాలీవుడ్ ఆఫర్ ని ఓకే చేయలేదు అని తెలిపారు.

- Advertisement -