- Advertisement -
పైలట్లు సమ్మెకు దిగారు. ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు చెందిన పైలట్లు సమ్మెకు దిగడంతో సంస్థకు చెందిన 800 విమానాలను ఆ సంస్థ రద్దు చేసింది. సమ్మె ప్రభావం లక్షా 30 వేల మంది ప్రయాణికులపై పడింది.
లుఫ్తాన్సా పైలెట్లు ఈ ఏడాది 5.5 శాతం మేర జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు యాజమాన్యం ఒప్పుకోలేదు. సీనియర్ పైలెట్లకు 900 యూరోలు అంటే 5 శాతం, కొత్త ఉద్యోగులకు 18 శాతం మేర జీతాలు పెంచుతామని తెలిపింది. ఈ ఆఫర్‌ను పైలెట్ల యూనియన్ నిరాకరించడంతో సమ్మె అనివార్యమైంది. విమానాల రద్దుతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫోర్ట్, మ్యూనిచ్ ఎయిర్‌పోర్టుల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
- Advertisement -