- Advertisement -
దాయాదుల పోరులో పైచేయి సాధించింది భారత్. దీంతో ఈ మ్యాచ్‌పై స్పందించారు పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పెద్ద తప్పు చేశాడని…13 లేదా 14 ఓవర్ వేయాల్సిన స్పిన్నర్‌ని ఆఖరి ఓవర్ వరకూ పక్కనపెట్టి చివర్లో వేయించడం పాకిస్థాన్ ఓటమికి కారణమని తెలిపారు.
చివరి వరకూ ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ బౌలర్లని రొటేట్ చేయడంలో తేలిపోయాడని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ జరిగిన దుబాయ్ పిచ్ నాకు బాగా నచ్చింది. రెండు జట్ల బౌలర్లు బౌన్సర్లు విసిరి వికెట్లు తీయడాన్ని బాగా ఎంజాయ్ చేశా అని తెలిపాడు. లాస్ట్ ఓవర్ వరకూ గేమ్‌ని తీసుకెళ్లగలిగారు. కానీ టీ20ల్లో చివరి 3-4 ఓవర్లని స్పిన్నర్‌తో అస్సలు వేయించకూడదు అని బాబర్‌కు హితవు పలికాడు.
- Advertisement -