అదొక్కటే బాధగా ఉంది: అనుపమ్‌

49
anupam
- Advertisement -

అనుపమ్ ఖేర్..బాలీవుడ్ స్టార్ యాక్టర్. దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన అనుపమ్‌ ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు.అయితే కొద్దిరోజులగా అనుపమ్‌ని బాలీవుడ్ దూరంగా పెట్టగా దీనిపై ఆయన స్పందించారు.

బాలీవుడ్ మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాలలో, స్టార్స్ సినిమాలలో నేను ఇప్పుడు కనపడట్లేదు. కరణ్‌ జోహార్‌, సాజిద్‌ నదియావాలా, ఆదిత్య చోప్రా సినిమాలు ఇప్పుడు చెయ్యట్లేదు. ఒకప్పుడు వీళ్ళకి నేను డార్లింగ్ ని. వీళ్ళు తీసిన చాలా సినిమాల్లో నేను ఉన్నాను. కానీ ఇప్పుడు వాళ్లు నాకు ఒక్క ఆఫర్‌ కూడా ఇవ్వట్లేదు అన్నారు.
దానిని తానేమీ తప్పుగా తీసుకోనని వాళ్లు ఛాన్స్ ఇవ్వకపోవడం వల్లే అనేక దారులు ఉన్నాయని తెలిసిందని చెప్పుకొచ్చారు. అయితే నా స్నేహితులు కూడా పక్కన పెట్టడం కొంచెం బాధగా ఉందని తెలిపారు.

- Advertisement -