బండి పాదయాత్ర..హైకోర్టుకు ప్రభుత్వం

17
bandi
- Advertisement -

బీజేపీ బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు అనుమతించగా ఇవాళ్టి నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం లంచ్‌ మోషన్‌ దాఖలు చేసింది. పాదయాత్ర సాగితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని అందులో పేర్కొన్నది. మధ్యాహ్నం సీజే ధర్మాసనం అంగీకరించింది.

బండి సంజయ్ పాదయాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుండడంతో యాత్ర నిలిపేయాలని జనగామ పోలీసులు ఆయనకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. పాదయాత్రకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

- Advertisement -