- Advertisement -
జర్నలిస్టుల ఇండ్ల సమస్యను పరిష్కరించిన భారత అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును క్లియర్ చేసినందుకు సీజేఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఈ తీర్పు తోడ్పడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
సుదీర్ఘ కాలంగా ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు సీజేఐ శుభవార్త వినిపించిన సంగతి తెలిసిందే. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల స్వాధీనానికి, నిర్మాణాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది.
- Advertisement -