చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ ఈనెల 27కు వాయిదా

62
flyover
- Advertisement -

ఈ నెల 27వ తేదీన‌ చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు జీహెచ్ఎంసీ అధికారులు ప్ర‌క‌టించారు. ఈ ఫ్లై ఓవ‌ర్‌ను మంగ‌ళ‌వార‌మే ప్రారంభించాల్సి ఉండ‌గా, అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా వేసిన‌ట్లు అధికారులు తెలిపారు. 674 మీట‌ర్ల పొడ‌వున్న ఈ ఫ్లై ఓవ‌ర్‌ను రూ. 45.29 కోట్ల వ్య‌యంతో నిర్మించిన సంగతి తెలిసిందే.

చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని ఒక కూడలి2007లోనే పైవంతెనను ప్రారంభించారు. మరోవైపున్న బంగారుమైసమ్మ దేవాలయ కూడలిలో ట్రాఫిక్‌ కష్టాలు పెరగడంతో పాత వంతెనను పొడిగించాలని బల్దియా నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ 2020లో శ్రీకారం చుట్టింది. పనులు తాజాగా పూర్తవడంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభిస్తే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, వరంగల్‌, విజయవాడ హైవేల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు సుమారు 10 నిమిషాల సమయం ఆదాతో పాటు స్థానిక ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిస్తూ చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను నిర్మించారు.

- Advertisement -