కవిత ఇంటిపై దాడి చేయడం దారుణం : తలసాని

72
minister talasani
- Advertisement -

ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేయడం దారుణమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగుతున్న సమయంలో బీజేపీ నేతలు కవిత ఇంటిపై రావడం దుర్మార్గమని, హేయమైన చర్యని మండిపడ్డారు.

ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌, కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌తో కలిసి మంత్రి మంగళవారం ఎంపీ కవితను పరామర్శించారు. అనంతరం మాట్లాడిన ఆయన…బీజేపీ నేతలు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీజేపీ ఆఫీస్‌ ముట్టడికి వెళ్తామని అని ఉంటున్నారని, మాకు సంస్కారం ఉందని.. మా పార్టీ అధినేత అది మాకు నేర్పలేదన్నారు.

ఒక ఎంపీ మాట్లాడిన మాటలను.. తప్పుడు ఆరోపణలను పట్టుకొని బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సమంజసం కాదన్నారు. బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు రావడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

- Advertisement -