కవితపై దాడిని ఖండించిన: ఎన్నారై టీఆర్‌ఎస్‌ అశోక్‌ గౌడ్‌

21
nri
- Advertisement -

ఢిల్లీ మద్యం పాల‌సీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నిరాధారణమైన ఆరోపణలు చేయడమే కాకుండా, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని ఎన్నారై అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము లేక‌నే బీజేపీ నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తుంద‌న్నారు. ఇలాంటి నిరాధార ఆరోప‌ణ‌ల‌తో ప్రజల్లో బీజేపీ మరింత చులకనవుతుందని అశోక్ తెలిపారు.

బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలకు కేసీఆర్ బెదిరే నాయకుడు కాదని, ఎంతో మందితో పోరాడి తెలంగాణ సాధించిన ఫైటర్ అని గుర్తు చేశారు. బీజేపీ నాయ‌కులు చిల్లర వేషాలు ఇప్పటికైనా ఆపకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ది చెప్తారని అశోక్ తేల్చిచెప్పారు.

- Advertisement -