దేశవ్యాప్తంగా భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ అత్యంత ప్రతిషాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ తిరంగా పండుగను ఆగస్టు 8న ఘనంగా ప్రారంభించారు. ఆగస్టు 22న ఎల్బీ స్టేడియంలో 25వేల మందితో స్వతంత్ర వజ్రోత్సవాలు ముగుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ షెడ్యూల్ విడుదల చేశారు. సాయంత్రం 4లకు ఎల్బీ స్టేడియం చేరుకోని జాతీయ జెండా ఎగుర వేసి, జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గోంటారు. అనంతరం జాతిపిత మహ్మత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. 4.05 నుంచి4.15 తెలంగాణ కల్చరల్ సంస్థకు అధ్యక్షురాలైన దీపికా రెడ్డితో కూచిపూడి నాట్యం జరుగనుంది. 4.15 నుంచి 4.30వరకు ప్రముఖ రచయితల ఖవ్వాలీలు అలాపన, 4.30 నుంచి 5.40 వరకు దేశ ప్రఖ్యాత గాంచిన సింగర్‌తో శంకర్ మహాదేవన్ సంగీత విభావరి కార్యక్రమంను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జాతీయ అంశాలపై నిర్మించిన లఘు చిత్రాలను ప్రదర్శిస్తారు. అనంతరం వజ్రోత్సవాల కమిటీ అధ్యక్షుడు కేకే ప్రసంగం తర్వాత సీఎం కేసీఆర్ జాతినిఉద్దేశించి మాట్లాడుతారు. ఈ సందర్భంగా 14 మంది స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యుల సన్మానం కార్యక్రమం నిర్వహిస్తారు. 25వేల మందితో సీఎం కేసీఆర్ జాతీయ నాయకుల కోసం క్యాండిల్ ప్రదర్శనను నిర్వహించనున్నారు. వోట్ ఆఫ్ థాంక్స్ తర్వాత జాతీయ గీతాలాపన తో కార్యక్రమం ముగుస్తుందని కమిటీ అధ్యక్షుడు కేకే తెలిపారు.
సీఎం కేసీఆర్ షెడ్యూల్ విడుదల
- Advertisement -
- Advertisement -