తెలంగాణ గడ్డపై బీజేపీ అడుగుపెడితే విశానమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజా దీవెన సభలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో మేము సైతం కేసీఆర్‌తో కలిసే పోరాడామన్నారు. ఇప్పుడు మీ ఎజెండానే మా ఎజెండా అని సీఎం కేసీఆర్ అన్నారని తెలిపారు. దేశ రాజకీయ పరిస్థితులతోనే టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు.
మా పోరాటం కేసీఆర్‌ను గద్దె దించేందుకు కాదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మా పోరాటమని స్పష్టం చేశారు. బీజేపీని ఓడగొట్టేందుకు టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు. మునుగోడు ప్రాంతంలోని సమస్యలన్నింటి పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఇక్కడ అభివృద్ధి జరగాలనే తాము పోటీలో ఉండడం లేదని, మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థినే గెలిపించాల్సి ఉందన్నారు. సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇందు కోసం పని చేస్తారన్నారు.