- Advertisement -
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. మలయాళ చిత్రం లూసిఫర్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న సినిమాకు సంబంధించి టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది.
ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రాబోతుండగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నయనతార, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ సినిమాలో ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని దసరా బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
- Advertisement -