- Advertisement -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతోంది. తాజాగా మెదక్ ఎమ్మేల్యే శేరి సుభాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గోని మొక్కలు నాటారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున్న జమ్మి మొక్కలు నాటారు. సంతోష్‌కుమార్ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరి చేత మొక్కలు నాటించారు. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగం కావడం చలా సంతోషంగా ఉందన్నారు.
- Advertisement -