- Advertisement -
స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశవరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగం, మతత్వాన్ని సమూలంగా దేశం నుంచి రూపుమాపాలని వెల్లడించారు. ప్రపంచానికి దిక్సూచిలా భారతదేశం ఎదగాలన్నారు. . దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం ఒకటన్నారు. దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలని తెలిపారు.
- Advertisement -