సామూహిక జాతీయ గీతాలాపన.. గ్రాండ్‌ సక్సెస్‌

60
cm
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా సాముహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం ఘనంగా సక్సెస్ అయింది. ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌గ‌ణ‌మ‌ణ గీతాన్ని ఆల‌పించగా అబిడ్స్‌ జీపీవో నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ ప్రముఖలు, అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన రాగా ఒక్క నిమిషం మెట్రోసర్వీసులు ఆగిపోగా.. ఎక్కడికక్కడే ప్రయాణికులు జాతీయ గీతం ఆలపించారు. జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగా విద్యార్థులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -