RC15లో మరో బాలీవుడ్ భామ!

73
huma kureshi
- Advertisement -

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం RC15.భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్‌ను తీసుకున్నట్లు సమాచారం.

బాలీవుడ్ నటి హుమా ఖురేషి ఓ కీలక పాత్రలో నటించనుందట. రాజకీయనాయకురాలి పాత్రలో ఆమె కనిపించే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఆమె పాత్రను శంకర్ డిజైన్ చేసిన తీరు సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -