- Advertisement -
కేజీఎఫ్‌తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురంకి చెందిన వ్యక్తి. తన తాత, తండ్రులు అంతా ఇక్కడే ఉండేవారు. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ప్రశాంత్ నీల్ కి బాబాయ్ అవుతారు.
ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి కొన్ని నెలల క్రితమే మరణించగా ఆయన సమాధిని ఇక్కడే నీలకంఠాపురంలో నిర్మించారు. తాజాగా 75 స్వాతంత్య్ర దినోత్సవం, అలాగే తన తండ్రి 75వ జయంతి కావడంతో సొంత ఊరుకి వచ్చాడు ప్రశాంత్ నీల్. సొంతూరులో ఉన్న బంధువులను పలకరించాడు, అక్కడి ఆలయాన్ని కూడా సందర్శించాడు. ఆ తర్వాత తన తండ్రి జ్ఞాపకార్థం నీలకంఠాపురంలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి విరాళంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.
ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్.
- Advertisement -