- Advertisement -
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల వేళ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా భారతీయులందరికీ ఇవాళ ఒక మైలురాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రంపచంలో మన దేశానికి ఉన్న విశిష్టతను మనం గౌరవించుకుందాం అని పిలుపునిచ్చారు. మనల్ని ఏకం చేసే అంశాలపై దృష్టి పెడుదాం.. మనల్ని విభజించి చూసే అంశాలపై దృష్టి పెట్టొద్దు. ప్రేమను, సంతోషాన్ని పంచండి.. ఈ దేశాన్ని మరింత గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
- Advertisement -