భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి!

61
TTD
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి 40 గంటల సమయం పడుతుండగా కొండపై ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ కీలక ఆదేశాలు జారీ చేసింది.

కొండపై రద్దీ దృష్టా భక్తులు యాత్రను వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు తిరుమల యాత్రను కొద్దిరోజులు వాయిదే వేసుకోవాలని సూచించారు. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా చూస్తున్నారు.

ఈనెల 21 వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కేవలం ప్రొటోకాల్‌ వీఐపీలకు మాత్రమే పరిమితం చేశారు. కాలినడకమార్గాల ద్వారా భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు.

- Advertisement -